కీర్తన.. 135. యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా, యెహోవా నామాన్ని స్తుతించండి. యెహోవా ఆలయంలో నిలిచి ఉండే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి! ఆలయ ప్రాంగణంలో నిలబడే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి! యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి. యెహోవాను స్తుతించుట ఆనందదాయకం గనుక ఆయన నామాన్ని స్తుతించండి. యెహోవా యాకోబును కోరుతున్నాడు. యెహోవా ఇశ్రాయేలును తన విశేషమైన సొత్తుగా ఎన్నుకొన్నాడు. యెహోవా గొప్పవాడని నాకు తెలుసు. మన ప్రభువు ఇతర దేవుళ్లందరికంటె గొప్పవాడు! ఆకాశంలో, భూమి మీద, సముద్రాల్లో, అగాధపు మహా సముద్రాల్లో యెహోవా ఏది చేయాలను కొంటే అది చేస్తాడు. భూమికి ప్తెగా మేఘాలను దెవుడు చేస్తాడు. మెరుపులను, వర్షాన్ని దెవుడు చేస్తాడు. దేవుడు గాలిని తన నిధిలోనుండి రప్పిస్తాడు. ఈజిప్టు మనుష్యులలో జ్యేష్టులందరినీ, జంతువులలో మొదట పుట్టినవాటన్నిటినీ దేవుడు నాశనం చేసాడు. దేవుడు ఈజిప్టులో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసాడు. ఫరోకు, అవి అతని అధికారులకు ఆ సంగతులు సంభవించేలా దేవుడు చేశాడు. దేవుడు అనేక రాజ్యాలను ఓడించాడు. బలమైన రాజులను దేవుడు చంపేసాడు. అమోరీయుల రాజైన సీహోనును దేవుడు ఓడించాడు. బాషాను రాజైన ఓగును దేవుడు ఓడించాడు. కనానులోని జనాంగాలన్నింటినీ దేవుడు ఓడించాడు. వారి దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. దేవుడు ఆ దేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు. యెహోవా, నీ పేరు శాశ్వతంగా ఖ్యాతి కలిగియుంటుంది. యెహోవా, ప్రజలు నిన్ను జనాంగాల్ని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొంటారు. యెహోవా జనాంగాల్ని శిక్షించాడు. కాని తన సేవకుల యెడల దయ చూపించాడు. ఇతర మనుష్యుల దేవుళ్లు కేవలం వెండి, బంగారు విగ్రహాలే. వారి దేవుళ్లు కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే. ఆ విగ్రహాలకు నోళ్లు ఉన్నాయి. కానీ అవి మాట్లాడలేవు. కళ్లు వున్నాయి కానీ అవి చూడలేవు. ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి కానీ అవి వినలేవు. ముక్కులు ఉన్నాయి కానీ అవి వాసన చూడలేవు. మరియు ఆ విగ్రహాలను తయారు చేసిన మనుష్యులు సరిగ్గా ఆ విగ్రహాల్లాగానే అవుతారు. ఎందుకంటే వారికి సహాయం చేయాలని వారు ఆ విగ్రహాల మీదనే నమ్మకముంచారు. ఇశ్రాయేలు వంశమా, యెహోవాను స్తుతించు! అహరోను వంశమా, యెహోవాను స్తుతించు. లేవీ వంశమా, యెహోవాను స్తుతించు! యెహోవాను ఆరాధించే ప్రజలారా, యెహోవాను స్తుతించండి. సీయోనులో నుండి, తన నివాసమైన యెరూషలేములో నుండి, యెహోవా స్తుతించబడును గాక! యెహోవాను స్తుతించండి!