కీర్తన.. 117. సర్వ దేశములారా, యెహోవాను స్తుతించండి. సర్వ ప్రజలారా, యెహోవాను స్తుతించండి. దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు శాశ్వతంగా మన పట్ల నమ్మకంగా ఉంటాడు. యెహోవాను స్తుతించండి!