కీర్తన.. 47. సంగీత నాయకునికి, కోరహు కుమారుల గీతం. సర్వజనులారా చప్పట్లు కొట్టండి. సంతోషంగా దేవునికి కేకలు వేయండి. మహోన్నతుడగు యెహోవా భీకరుడు. భూలోకమంతటికీ ఆయన రాజు. ఆయన ప్రజలను మనకు లోపరిచాడు. ఆ రాజ్యాలను మన పాదాల క్రింద ఉంచాడు. దేవుడు మన కోసం మన దేశాన్ని కోరుకున్నాడు. యాకోబు కోసం అద్భుత దేశాన్ని ఆయన కోరుకున్నాడు. యాకోబు ఆయన ప్రేమకు పాత్రుడు. బూర మ్రోగగానే యుద్ధనాదం వినబడగానే యెహోవా దేవుడు లేచాడు. దేవునికి స్తుతులు పాడండి. స్తుతులు పాడండి. మన రాజుకు స్తుతులు పాడండి. స్తుతులు పాడండి. దేవుడు సర్వలోకానికి రాజు. స్తుతిగీతాలు పాడండి. దేవుడు తన పరశుద్ద సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుడు సకల రాజ్యాలనూ పాలిస్తు న్నాడు. రాజ్యాల నాయకులు దేవుని ప్రజలతో సమావేశ మయ్యారు. దేవుని ప్రజలు అబ్రాహాము వంశస్థులు. వారి జనాంగమును కాపాడును. నాయకులందరూ దేవునికి చెందినవారు. దేవుడు మహోన్నతుడు.